ఆఫ్ఘన్ యూనివర్సిటీలో.. మగ, మహిళా విద్యార్థుల మధ్య కర్టెన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశ యూనివర్సిటీలో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పురుషులు, మహిళా విద్యార్థుల మధ్య కర్టెన్లు ఏర్పాటు చేశారు. మగ, మహిళా విద్యార్థులు చెరో వైపు కూర్చొని ఉండగా వారి మధ్య పరదాలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా అబయా వస్త్రాన్ని ధరించాలని, ముఖాన్ని నిఖాబ్తో కప్పుకోవాలని తాలిబన్ ఆదేశించింది. అలాగే మగ, మహిళా విద్యార్థులకు విడివిడిగా లేదా పరదా ద్వారా విభజించి తరగతులు నిర్వహించాలని పేర్కొంది. మహిళల విద్యకు సంబంధించి తాలిబన్ సుదీర్ఘ పత్రం జారీ చేసింది. మహిళా విద్యార్థులకు మహిళలు మాత్రమే బోధించాలని ఆదేశించారు. అది సాధ్యం కాకపోతే మంచి నడవడి కలిగిన వృద్ధులతో బోధించవచ్చని తెలిపింది.
పురుషులు, మహిళలు విడివిడిగా ప్రవేశ, నిష్క్రమణలను ఉపయోగించాలని తాలిబన్ పేర్కొంది. మహిళలు విడిగా చదువుకోవాలని, మగవారితో కలవకుండా ఉండేందుకు ఐదు నిమిషాల ముందుగా పాఠాలు ముగించాలని, మగ విద్యార్థులు వెళ్లేంత వరకు వేచి ఉండే గదుల్లో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాలిబన్ ఉన్నత విద్యా శాఖ ఒక డిక్రీని జారీ చేసింది.
కాగా, మహిళా విద్యార్థులకు ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ వారు చదువుకునేందుకు తాలిబన్లు అనుమతించడం గొప్ప విషయమని ఆ దేశ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. మగ, మహిళా విద్యార్థులకు వేర్వేరుగా క్లాసులు నిర్వహించేందుకు తగినంత మహిళా బోధకులు, సౌకర్యాలు లేవని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

