స్టాక్‌హోమ్: సాహిత్య నోబెల్ విజేతగా ఫ్రాన్స్‌కు చెందిన అన్నీ ఎర్నాక్స్ నిలిచారు. లింగం, భాష, తరగతుల మధ్య ఉన్న విబేధాలపై అనేక రచనలు చేశారని కొనియాడుతూ ఆమెకు ఈ బహుమతి ప్రదానం చేస్తున్నట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
ఎర్నాక్స్ మొత్తం 20కిపైగా సాహిత్య రచనలు చేశారు. లైంగిక దాడులు, అబార్షన్, అనారోగ్యం, తన తల్లిదండ్రుల మరణంపై ఎక్కడా రాజీపడకుండా రచనలు చేశారని అకాడమీ వెల్లడించింది. 1940లో జన్మించిన ఆమె.. తన 82 ఏండ్ల జీవితంలో సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు తన కలానికి పనిపెట్టారు. నోబెల్ బహుమతి దక్కటంపై ఎర్నాక్స్ సంతోషం వ్యక్తం చేశారు.