బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీ నుంచి అంతర్గత ఒత్తిళ్లు
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన లేబర్ పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్టార్మర్ సోమవారం ప్రకటించారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం తాను అమితంగా ప్రేమించే దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఉంటుందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని 63 ఏండ్ల స్టార్మర్ పేర్కొన్నారు.
- పదేండ్లలో పదవి నుంచి తప్పుకొన్న ఆరో ప్రధాని స్టార్మర్
- కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్?
లండన్, జూన్ 22 : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన లేబర్ పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్టార్మర్ సోమవారం ప్రకటించారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం తాను అమితంగా ప్రేమించే దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఉంటుందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని 63 ఏండ్ల స్టార్మర్ పేర్కొన్నారు. తద్వారా గత పదేండ్లలో తరచుగా నాయకులు మారుతున్న పరిణామ క్రమంలో పదవి నుంచి వైదొలుగుతున్న ఆరవ ప్రధానిగా ఆయన నిలిచారు. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని లేబర్ పార్టీ పాలక మండళ్లను కోరనున్నట్లు స్టార్మర్ తెలిపారు.
మద్దతు తగ్గింది
లేబర్ పార్టీలో తన నాయకత్వానికి ఉన్న మద్దతు తగ్గిపోయిందని తన రాజీనామా ప్రసంగంలో స్టార్మర్ అంగీకరించారు. వరుస వివాదాలు, విధానపరమైన నిర్ణయాల మార్పులు, ప్రజా మద్దతు తగ్గడం వంటి పరిణామాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా స్టార్మర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని బయటి నుంచే కాక లేబర్ పార్టీలోనుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్మర్ నిష్క్రమణతో కేవలం ఒక దశాబ్దం కాలంలోనే బ్రిటన్ ఏడవ ప్రధానమంత్రిని పొందనున్నది.
తదుపరి ప్రధాని ఆండీ బర్న్‌హామ్?
కీర్ స్టార్మర్ రాజీనామాతో ఆయన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. గత వారం జరిగిన పార్లమెంటరీ ఉప ఎన్నికలో విజయం సాధించిన గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుగా నిలువనున్నారు. కింగ్ ఆఫ్ ది నార్త్‌గా పేరుపొందిన లేబర్ పార్టీ నాయకుడు బర్న్‌హామ్ మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికలో విజయం సాధించి వెస్ట్‌మినిస్టర్‌కు తిరిగి వచ్చిన తర్వాత తదుపరి బ్రిటిష్ ప్రధాన మంత్రి అయ్యే అవకాశం అధికంగా ఉంది. స్టార్మర్ నాయకత్వానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్న లేబర్ పార్టీ సభ్యులు, మద్దతుదారులకు 56 ఏండ్ల్ల బర్న్‌హామ్ ఒక కీలక నాయకుడిగా ఉద్భవించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

