James Cleverly | భార్యల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు.. దుమారం రేగడంతో సారీ చెప్పిన బ్రిటన్ హోంమంత్రి
James Cleverly | దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యలను ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని ఇటీవల బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ (James Cleverly) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. క్లెవర్లీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ బ్రిటన్ విపక్షం డిమాండ్ చేస్తున్నది.
లండన్: వివాహబంధం దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యలను ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని ఇటీవల బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ (James Cleverly) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. క్లెవర్లీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ బ్రిటన్ విపక్షం డిమాండ్ చేస్తున్నది.
ఈ నెల 18న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నివాసంలో జరిగిన విందులో మహిళా అతిథులతో సరదాగా మాట్లాడుతూ.. క్లెవర్లీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తన భర్త కంటే మెరుగైన వారు ఎంతో మంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యకు నిరంతరం కొద్ది మోతాదులో మత్తిచ్చి జోకొట్టాలి. మత్తును చాలా కొద్ది మోతాదులో ఇవ్వడం చట్టవిరుద్ధమేమీ కాదు’ అన్నారు.
క్లెవర్లీ వ్యాఖ్యలపై బ్రిటన్‌లో తీవ్ర దుమారం రేగింది. దాంతో తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ప్రైవేటు సంభాషణల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు కేవలం సరదా కోసమేనని అన్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆందోళనలు సద్దుమణగలేదు. క్లెవర్లీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

