Elon Musk ‘X’ | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ లోగో మారింది. ఇప్పటి వరకు ట్విట్టర్‌కు పక్షి లోగో ఉండగా.. ఆ పక్షీని తొలగించి ‘ఎక్స్’ లోగోను పెట్టారు. గత సోమవారం ట్విట్టర్ కొత్త లోగో ‘ఎక్స్’ను మస్క్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ లోగో ప్రపంచవ్యాప్తంగా మారిన.. నిన్నటివరకు ఇండియాలో మాత్రం ట్విట్టర్ లోగోనే ఉంది. తాజాగా ఇండియాలో కూడా ‘ఎక్స్’ లోగో వచ్చేసింది. ఇక ట్విట్టర్ పూర్తిగా ‘ఎక్స్’గా మారినట్లు మస్క్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ట్విట్టర్లో ‘ఎక్స్’ (X) ఫోటోను అప్లోడ్ చేశారు.
ఇక ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ భారీ మార్పులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ట్విట్టర్‌ను రీబ్రాండిగ్ చేయనున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన విచాట్ (We chat)తరహాలో ఎవ్రీథింగ్ ‘ఎక్స్’ యాప్‌ను రూపొందించాలని ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కేవలం సామాజిక మాధ్యమంగానే కాకుండా పేమెంట్ సర్వీసెస్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ వంటి అని రకాల సేవలు అందించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దనున్నారు.
— Elon Musk (@elonmusk) July 29, 2023