వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై హత్యాయత్న ప్రయత్నం జరిగింది. వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రస్తుతం ట్రంప్‌తో పాటు ఇతర మంత్రులు, అధికారులు అందరూ సేఫ్‌గా ఉన్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. ఆ సాయుధుడిని పట్టుకున్నాయి. అతని ఫోటోను రిలీజ్ చేశారు. పలు రకాల ఆయుధాలతో అతను సెక్యూర్టీపాయింట్ వద్దకు వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. చాలా వేగంగా రియాక్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
సెక్యూర్టీ స్క్రీనింగ్ ఏరియాలో వద్ద కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఓ ఆఫీసర్‌ను సాయుధుడు కాల్చాడు. అయితే బుల్లెట్‌ఫ్రూఫ్ ఉండడం వల్ల అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు ట్రంప్ తెలిపారు. ఆ ఆఫీసర్‌తో మాట్లాడాను అని, అతను బాగా ఉన్నట్లు అధ్యక్షుడు తెలిపారు. తన ట్రుత్ సోషల్ అకౌంట్లో అనుమానిత సాయుధుడి ఫోటోలు, వీడియోలను ట్రంప్ పోస్టు చేశారు.