కదులుతున్న భారీ మంచుకొండ!
అంటార్కిటికా నుంచి విడిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ మహాసముద్రంలో ముందుకు కదులుతున్నది.
- పరిమాణంలో న్యూయార్క్ నగరమంత పెద్దది
న్యూయార్క్: అంటార్కిటికా నుంచి విడిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ మహాసముద్రంలో ముందుకు కదులుతున్నది. ‘ఏ23ఏ’గా పిలుస్తున్న ఈ ఐస్బర్గ్ న్యూయార్క్ నగరమంత పరిమాణంలో ఉన్నదని, మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారి ముందుకు కదులుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 4వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ కొండ అంటార్కిటికా మహాసముద్రంలో ప్రమాదకరంగా మున్ముందుకు దూసుకెళ్తున్నట్టు తేల్చారు. ఇది పశ్చిమ అంటార్కిటికా నుంచి 1986లో విడిపోయింది. అప్పటినుంచీ కదలకుండానే ఉన్నది. అయితే, ట్రిలియన్ మెట్రిక్ టన్నుల బరువున్న ఈ మంచుకొండ బలమైన గాలులు, ప్రవాహాల వల్ల ఇటీవల అంటార్కిటికా ద్వీపకల్పం ఉత్తరకొనను దాటి ముందుకు కదులుతున్నట్టు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

