Afghanistan : మాజీ ఉపాధ్యక్షుడి కుమారుడు కిడ్నాప్
Afghanistan : మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కుమారుడిని తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు. ఆయను బుధవారం సాయంత్రం జవాజాన్ విమానాశ్రయం నుంచి..

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్ కుమారుడిని తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు. ఆయను బుధవారం సాయంత్రం జవాజాన్ విమానాశ్రయం నుంచి కిడ్నాప్ చేశారు. కొందరు ఆఫ్ఘన్ సైనికులను కూడా తమ ఖైదీలుగా తీసుకువెళ్లినట్లు సమాచారం అందింది. అయితే, ఈ ఘటనను తాలిబాన్ లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించ లేదు.
దోస్తుమ్ కుమారుడిని తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. దోస్తుమ్ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. అతను 1990 లలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉత్తర కూటమిని స్థాపించి రాజకీయంగా ఎదిగారు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ సంస్థ కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విముక్తి కోసం ఈ కూటమిని ఏర్పాటుచేశారు. దీని అధికారిక పేరు యునైటెడ్ ఇస్లామిక్ ఫ్రంట్.
బుధవారం ఉదయం మజారే షరీఫ్ నగరాన్ని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సందర్శించారు. అక్కడ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్, బాల్ఖ్ మాజీ గవర్నర్ అలా ముహమ్మద్ నూర్‌తో పాటు మరికొందరు నాయకులతో భేటీ అయ్యారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఘనీ వెళ్లిపోయిన కొద్దిసేపటికే దోస్తుమ్ కుమారుడు కిడ్నాప్‌నకు గురవడం కలకలం రేపింది. 2014 నుంచి ఆరేండ్లపాటు ఆఫ్ఘాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దోస్తుమ్ అమెరికా అనుకూలుడిగా ముద్ర ఉన్నది. 9/11 దాడుల అనంతరం ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా మిలటరీకి సాయమందించడంలో దోస్తుమ్ కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. టర్కీలో చికిత్స పొంది ఇటీవలనే కుటుంబంతో పాటు దోస్తుమ్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు.
ఇవి కూడా చదవండి..
ఈ హీరో రాకతో ఎగిరి గంతేసిన మీరాబాయి చాను.. ఎవరా హీరో తెలుసా?
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

