బీజింగ్: తైవాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తైవాన్ చైనాలో అంతర్భాగమేనని పేర్కొన్న హోండురాస్.. వన్ చైనా పాలసీని అధికారికంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. తైవాన్‌తో పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకుంటున్నట్టు ఆదివారం వెల్లడించింది.
“చైనా నుంచి విడదీయలేని భూభాగం తైవాన్. హోండూరస్, తైవాన్ మధ్య సంబంధాలు అత్యంత బలహీనస్థాయికి చేరుకున్నాయి. ఇక నుంచి ఆ దేశంతో ఏ విధమైన అధికారిక సంబంధాలూ కొనసాగించటం లేదు” అంటూ హోండూరస్ ప్రభు త్వం తెలిపింది.