టొరంటో: కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్ధి విచక్షణారహితంగా కత్తితో అటాక్(Knife Attack) చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే అతను వీరంగం సృష్టించాడు. ప్రోఫెసర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థుల్ని కత్తితో పొడిచాడు. జెండర్ ఇష్యూస్ అంశంపై తరగతి జరుగుతున్న సమయంలో ఆ ఉన్మాది దాడికి దిగాడు. ప్రస్తుతం అతను పోలీసులు అదుపులో ఉన్నాడు. గాయపడ్డ ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యూనివర్సిటీ కమ్యూనికేషన్స్ అధికారి నిక్ మానింగ్ ఈ ఘటన గురించి వివరాలు తెలిపారు. ఫిలాసఫీ 202 క్లాసులో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కత్తితో వచ్చిన విద్యార్థి.. ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి .. మీరే ప్రొఫెసరా అని అడిగాడని, ఆ తర్వాత అతన్ని పొడిచినట్లు కైమాక్ అనే విద్యార్ధి ప్రశ్నించాడు. దాడి జరిగిన సమయంలో తరగతి గదలో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది.