బార్సిలోనా: మత్తు సూదులు, సిరంజిలతో మహిళలను టార్గెట్ చేస్తున్న ఘటనలు ఇటీవల స్పెయిన్‌లో ఎక్కువయ్యాయి. ఈ మధ్య బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. రద్దీగా ఉండే క్లబ్బుల వద్ద ఈ ఘటనలు జరుగుతున్నట్లు గుర్తించారు. సూది దాడులకు సంబంధించిన ఘటనలు సోషల్ మీడియాలోనూ షేర్ అవుతున్నాయి. క్లబ్ నుంచి బయటకు వెళ్తున్న మహిళలపై మత్తు ఉన్న సూది లేదా సిరంజీతో అటాక్ చేస్తారు. మహిళ చేయి లేదా కాలుపై ఆ దాడి జరుగుతుంది.
అయితే మహిళలను లైంగికంగా వేధించాలన్న ఉద్దేశంతో కొందరు ఇలా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఎక్కువగా రద్దీ ఉండే క్లబ్‌ల వద్దే ఈ ఘటనలు జరుగుతున్నట్లు తేల్చారు. స్పెయిన్‌లోని కటలోనియా ప్రాంతంలో ఇప్పటి వరకు 23 కేసులను గుర్తించారు. చేయి లేదా కాలుపై సూదితో గుచ్చిన తర్వాత ఆ మహిళ సొమ్మసిల్లిపోతుంది. సూది దాడి జరిగినట్లు అనుమానం ఉన్నవాళ్లు వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.