లండన్, మార్చి 27: ఇంటర్నెట్ స్పీడ్‌లో యూకేకు చెందిన పరిశోధకులు కొత్త రికార్డును సృష్టించారు. బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన బృందం ప్రామాణిక ఆప్టికల్ ఫైబర్‌ను వినియోగించి సెకనుకు 301 టెరాబిట్ల(టీబీపీఎస్) (9000 హెచ్డీ సినిమాలకు సమానం) ఇంటర్నెట్ వేగాన్ని సృష్టించారు. సగటు బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ స్పీడ్ కన్నా ఇది దాదాపు 45 లక్షల రెట్లు ఎక్కువ అని పరిశోధకులు తెలిపారు.
ఈ స్పీడ్ ద్వారా ఇంటర్నెట్ మూవీ డాటాబేస్(ఐఎండీబీ)లో ఉన్న ప్రతి సినిమానీ కేవలం ఒక్క నిమిషంలోపే డౌన్లోడ్ చేయవచ్చు. ఒక కొత్త ఆప్టికల్ ప్రాసెసింగ్ పరికరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వీరు ఇంటర్నెట్ స్పీడ్‌లో ఈ రికార్డును సాధించారు. సాధారణంగా ఇండ్లు, కార్యాలయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వినియోగించే ఆప్టికల్ ఫైబర్‌ను వినియోగించే ఈ స్పీడ్‌ను అందుకున్నట్టు ఆస్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐయాన్ ఫిలిప్స్ తెలిపారు.