రేపు ఐరాస భద్రతా మండలిలో ప్రత్యేక సెషన్… రష్యాను తొలగించాలని జెలెన్స్కీ డిమాండ్
కీవ్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎస్ఎస్సీ)లో ఉక్రెయిన్ అంశంపై సోమవారం ప్రత్యేక సమావేశం జరుగనున్నది. రష్యా దండయాత్రను ఖండిస్తూ పశ్చిమ, ఐరోపా దేశాలు చేసిన ముసాయిదా తీర్మానంపై చర్చించనున్నారు. సమావేశాలు, ఎజెండాలు, మీటింగ్ షెడ్యూల్స్‌లో ఈ ప్రత్యేక సమావేశం గురించి యూఎస్ఎస్సీ ప్రకటించింది.
మరోవైపు తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యా స్థానాన్ని తొలగించాలని తాజాగా ఆయన డిమాండ్ చేశారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శనివారం ఆయన మాట్లాడారు. రష్యా దాడిని ‘జాతి నిర్మూలన’గా పరిగణించాలని కోరారు. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో రష్యాకు ఓటు హక్కు లేకుండా చేయాలని కోరారు.
కాగా, ఉక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలిలో సోమవారం ప్రత్యేక సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. యూఎస్ భద్రతా మండలి నుంచి ఏకంగా రష్యానే తొలగించాలని ఆదివారం డిమాండ్ చేశారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను నిలువరించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) కూడా ఆయన ఆశ్రయించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

