కలిసి ఫొటోలు దిగిన అమెరికా, రష్యా సైనికులు… ఎక్కడంటే?
సిరియాలోని రెండు వైరి వర్గాలకు అమెరికా, రష్యా దళాలు మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు చాలా సార్లు సమీపంగా వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా పరస్పర దాడులు జరుపుకోలేదు. అలాగే పలకరించుకోలేదు.
డమాస్కస్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు ప్రధానంగా అమెరికా గుర్రుగా ఉన్నది. అయినప్పటికీ అమెరికా, రష్యా సైనికులు ఒక చోట కలుసుకున్నారు. అంతేగాక ఫొటోలకు కూడా ఫోజులిచ్చారు. ఎన్నో ఏళ్లుగా అంతర్గత యుద్ధంతో అట్టుడుగుతున్న సిరియాలో ఈ సంఘటన జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు 2014లో ఈశాన్య సిరియాలో అమెరికా సైనిక దళాలు అడుగుపెట్టాయి. అయితే సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ వర్గానికి రష్యా మద్దతుగా నిలిచింది. కుర్దిష్ యోధులపై టర్కీ దాడుల నేపథ్యంలో 2019 నుంచి రష్యా దళాలు అక్కడ మోహరించాయి. దీంతో సిరియాలోని రెండు వైరి వర్గాలకు అమెరికా, రష్యా దళాలు మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు చాలా సార్లు సమీపంగా వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా పరస్పర దాడులు జరుపుకోలేదు. అలాగే పలకరించుకోలేదు.
కాగా, శనివారం ఉదయం అరుదైన సంఘటన జరిగింది. ఈశాన్య ప్రావిన్స్ హస్సాకేలోని ఖహ్తానియా పట్టణానికి సమీపంలో ఉన్న చమురు క్షేత్రం వద్ద అమెరికా, రష్యా దళాలు తారసపడ్డాయి. అయితే ఎప్పటి మాదిరిగా పట్టించుకోనట్లు ఇరు దేశాల సైనికులు వ్యవహరించలేదు. తమ తమ సైనిక వాహనాలు నిలిపి పరస్పరం మాట్లాడుకున్నారు. అంతేగాక ఫొటోలకు ఫోజులిచ్చారు. తమ కలయికకు గుర్తుగా యూనిఫామ్లపై ధరించే చిన్న పాచెస్ను కొందరు సైనికులు ఇచ్చిపుచ్చుకున్నారు.
మరోవైపు ఇది ‘చాలా అరుదైన సంఘటన’ అని సిరియా నిపుణుడు శామ్యూల్ రమణి అన్నారు. అమెరికా, రష్యా ఇప్పటికీ సిరియాలో ఘర్షణను కోరుకుంటున్నాయని, దీనికి ఇదే సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

