నాతో పడుకో… లేదంటావా.. మరో 20 మందిని తీసుకొస్తా. బలవంతం చేస్తాం… ఇదీ… ఓ రష్యా సైనికుడు ఉక్రెయిన్లోని ఓ మహిళను బెదిరించిన తీరు. ఖేర్సన్లోని 16 ఏళ్ల గర్భిణీ విషయంలో రష్యన్ సైనికుడు వ్యవహరించిన తీరు. ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలు తప్పుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే.. రష్యా సైనికుల తీరును కూడా ప్రపంచ దేశాలు తూర్పురా పడుతున్నాయి.
ఓ రష్యా సైనికుడు తప్ప తాగి నా దగ్గరికి వచ్చాడు. బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నేను ప్రతిఘటిస్తున్నాను. నాతో పడుకో.. లేదంటే… మరో 20 మందిని తీసుకొస్తా అంటూ భయపెట్టించాడు అని 16 ఏళ్ల గర్భిణీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
రష్యా సైనికులు బాంబులు వేస్తున్న నేపథ్యంలో ఈ కుటుంబం ఓ బేస్మెంట్లో తలదాచుకుంది. అయితే.. పిల్లలకు భోజనం పెట్టించడానికి బయటికి వచ్చిన సమయంలో తప్ప తాగిన రష్యా సైనికుడు వారిని అడ్డుకున్నాడు. పై విధంగా మాట్లాడాడు.
ఎంత మంది వున్నారని అడిగాడు. ముగ్గురం అని చెప్పా. మొదట మా అమ్మను పిలిచాడు. కానీ తొందరగానే విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత నన్ను పిలిచాడు. నేను బయటికి వెళ్లగానే నాపై అరిచాడు. బట్టలు విప్పమన్నాడు. నేను నో చెప్పాను. ఒప్పుకో.. లేదంటే మరో 20 మందిని తీసుకొస్తాను అంటూ హెచ్చరించాడని ఆమె వాపోయింది.