రష్యా సైనికులు కొందరు ఉక్రెయిన్‌పై దాడికి ఏమాత్రం సిద్ధంగా లేరా? అన్య మనస్కంగానే దాడులు చేస్తున్నారా? ఉక్రెయిన్‌లోని పరిస్థితులను చూసి చలించిపోతూ.. ఏడ్చేస్తున్నారా? అంటే అవుననే అంటోంది ఓ రిపోర్టు. ఈ విషయాన్ని పెంటగాన్‌ను చెందిన ఓ అధికారి న్యూయార్క్ టైమ్స్‌తో పంచుకున్నారు. రష్యా సైనికులు అన్యమనస్కంగానే ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నారని, దాడులు చేసే సమయంలో కలత చెందుతూ, ఏడ్చేస్తున్నారని ఆ అధికారి పేర్కొంటున్నారు. అంతేకాకుండా.. యుద్ధం నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రష్యాకు చెందిన వాహనాలను వారే కాల్చేస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా సైనికుల్లో ఎక్కువ శాతం యువకులు ఉన్నారని, వారికి మిలటరీ ట్రైనింగ్ సరిగ్గా అందలేదని కూడా ఆ అధికారి పేర్కొంటున్నారు. అదేవిధంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి వారు అస్సలు సంసిద్ధులుగా లేరని కూడా పేర్కొన్నారు. వారికి సరైన భోజన సదుపాయాలు కూడా లేవని, ఇంధనం కూడా లేదని.. వీటన్నింటితో పాటు ఏమాత్రం మనోబలం లేకుండానే పోరాడుతున్నారని ఆ అధికారి పేర్కొన్నారు.