చేతుల్లో గ్రెనైడ్లు పట్టుకొని రష్యా సైనికులు భయపెడుతున్నా.. లొంగేది లేదంటున్న ఉక్రెయిన్ ప్రజలు
ఉక్రెయిన్‌పై రష్యా గత ఎనిమిది రోజులుగా బాంబులతో దాడులు చేస్తూనే వుంది. ప్రధాన నగరాలతో పాటు సామాన్య పౌరులపై కూడా పాశవికంగా దాడులకు దిగుతూనే వుంది. ఉక్రెయిన్ ప్రజలను, ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేయాలో.. అన్ని విధాలుగా రష్యా సేనలు ఇబ్బందులు పెడుతూనే వున్నాయి.. తాజాగా మరో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. రష్యాకి చెందిన కొందరు సైనికులు.. తమ చేతుల్లో గ్రెనైడ్ బాంబులను ఉంచుకొని.. ఉక్రెయిన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే.. ఉక్రెయిన్ ప్రజలు ఏమాత్రం భయపడకుండా.. వారికి అంతే దీటుగా సమాధానమిస్తున్నారు. ఎంత భయభ్రాంతులకు గురి చేసినా… తాము మాత్రం రష్యా సైనికులకు మోకరిల్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
రష్యా సైనికులు ఏకంగా గ్రెనైడ్ చేతుల్లో పట్టుకొని, నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్లి.. భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ఉక్రెయిన్ ప్రజలు భయపడి, తమకు లొంగిపోతారన్నది రష్యన్ సైనికుల వ్యూహం. అయితే.. రష్యా సైనికులు గ్రెనైడ్లతో సమీపిస్తుంటే.. ఉక్రెయిన్ ప్రజలు షేమ్.. షేమ్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తాము ఎంత మాత్రం రష్యా సైనికులకు లొంగిపోమని, తాము పోరాటాన్నే ఎంచుకుంటామని ఉక్రెయిన్ ప్రజలు స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

