Russian elections: రష్యా ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులు: ఈయూ
Russian elections: రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగలేదని యురోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ తెలిపారు. ఆ ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ త్వరలోనే 27 ఈయూ సభ్యదేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి.
న్యూఢిల్లీ: రష్యా ఎన్నికలపై(Russian elections) యురోపియన్ యూనియన్ కామెంట్ చేసింది. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ తెలిపారు. ఆ ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 ఈయూ సభ్యదేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి. తాజాగా ముగిసిన దేశాధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు. అయిదోసారి ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పుతిన్కు 87 శాతం ఓట్లు పోలయ్యాయి.
పుతిన్ నెగ్గింది సూడో ఎలక్షన్ అని జర్మనీ ఆరోపించింది. ఓటింగ్ స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగలేదని అమెరికా తెలిపింది. అధికార దాహంతో పుతిన్ ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఎన్నటికీ పరిపాలనను తన చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
అమెరికా ప్రజాస్వామ్యం కన్నా రష్యా ప్రజాస్వామ్య బెటర్ అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలైన జపొరిజియా, ఖేర్సన్, డోనస్కీ, లుహాన్స్, క్రిమియాలో కూడా ఓట్లు వేశారు. దేశవ్యాప్తంగా సుమారు 77 శాతం పోలింగ్ జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

