మిలాన్: ఫేమస్ రేబాన్ బ్రాండ్ కంటి అద్దాల కంపెనీ ఓనర్ లియోనార్డో డెల్ వెచ్చియో కన్నుమూశారు. కంటి అద్దాల మార్కెట్లో రేబాన్ అద్దాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. లియోనార్డో డెల్ వయసు 87 ఏళ్లు. ఎస్సిల్లార్ లక్సోటికా పేరుతో 25 ఏళ్ల వయసులో ఆయన కంపెనీ స్టార్ట్ చేశాడు. చిన్నపాటి కంటి అద్దాల షాపుతో ప్రపంచ వ్యాప్తంగా మేటి బిజినెస్‌మాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం లక్సోటికా కంపెనీ చైర్మెన్‌గా ఉన్నారు. ఇటలీలో ఓ అనాథగా ఉన్న బాలుడు.. ప్రపంచ సంపన్నుడిగా ఎలా మారాడన్న డెల్ వెచ్చియో స్టోరీ అందరికీ తెలిసిందే. 1961లో లక్సోటికా కంపనీని ఆయన స్థాపింయారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి వచ్చిన రేబాన్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ను సంపాదించుకున్నది.