Queen Elizabeth II | బ్రిటన్ రాణికి కరోనా పాజిటివ్
Queen Elizabeth II | బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింపబడినట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ ఆదివారం ప్రకటించింది. 95 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుతం తన విండ్సర్ కాజిల్‌లో నివాసం ఉంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు వైద్యం కొనసాగుతోందని తెలిపింది. కొవిడ్ నుంచి కోలుకునేందుకు తీసుకోవాల్సిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తున్నట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ వెల్లడించింది. ఎవరికైనా కరోనా సోకితే 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఇటీవలే ఇంగ్లండ్ ప్రకటించింది. ఈ నెల మొదట్లో ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కామిల్లా కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
క్వీన్ ఎలిజబెత్ తొలిసారిగా 2021, జనవరిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇటీవల బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు బంకింగ్‌హోం ప్యాలెస్ తెలిపింది. అయినప్పటికీ మరోసారి ఆమె కొవిడ్ బారిన పడ్డారు. గత ఏప్రిల్‌లో 99 సంవత్సరాల వయస్సులో మహారాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

