శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు జాతీయ జెండాలు చేబూని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇండ్లను ఆక్రమించారు. అక్కడే నిరసనకు దిగారు. అధ్యక్షుడి అధికారిక భవనంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టారు. ఆయన కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాలను ఆరగించారు. బెడ్రూంలో సెల్ఫీలు దిగుతూ రచ్చరచ్చ చేశారు. కాగా, ప్రధాని ఇంట్లోని బెడ్‌పై ఆందోళనకారులు డబ్ల్యుడబ్ల్యుఈ ఆడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఆందోళనకారులు ఆయన వ్యక్తిగత నివాసాన్ని తగులబెట్టారు. అంతకుముందు ఆయన నివాసంలోకి ప్రవేశించారు. ప్రధాని బెడ్‌పై కొందరు డబ్ల్యుడబ్ల్యుఈ ఆడారు. ప్రొఫెషనల్ రెజ్లర్ల మాదిరిగా నటిస్తూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నట్లు నటించారు. ఈ వీడియోను శ్రీలంక ట్వీట్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
Video – #WWE Wrestling on Prime Minister’s bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022