ఆ టీకాలను నెల రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు..

బ్రసెల్స్: ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ గురించి ఓ తీపి కబురు చెప్పింది యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఫైజర్ టీకాలను నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో దాచవచ్చు అని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ టీకాలను అతిశీతల ఉష్ణోగ్రతల్లో స్టోర్ చేయాల్సి ఉంటుందని మొదట్లో తెలిపారు. అయితే ఓపెన్ చేయనటువంటి ఫైజర్ టీకా బుడ్డీలను .. సాధారణ ఫ్రిడ్జ్‌ల్లో నెల రోజుల పాటు పెట్టువచ్చు అని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న నియమం ప్రకారం.. ఫైజర్ టీకాలను ఫ్రిడ్జ్‌లో కేవలం అయిదు రోజులు మాత్రమే ఉంచాలి. అయితే వ్యాక్సిన్ నిల్వ చేసే సమయాన్ని పెంచడం వల్ల.. ఆ టీకా సరఫరా కూడా వేగం పుంజుకుంటుందని ఈయూ అభిప్రాయపడింది.
వ్యాక్సిన్లను సరఫరా చేయడం, ఆ తర్వాత వాటిని అతిశీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయడం కొంత కష్టసాధ్యమైన పని. ఫైజర్ టీకాల్లో ఉన్న లోపం అదే. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరినట్లు అవుతుంది. ఫైజర్ స్టోరేజీకి ఫ్రీజర్లు అవసరం ఉన్న నేపథ్యంలో.. ఆ టీకాలను కొన్ని దేశాలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు ఆ సమస్యలు తీరనున్నాయి. మొదటల్లో మైనస్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిల్వ చేయాలని, ఆ తర్వాత మైనస్ 25సీ ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయాలని అమెరికా కంపెనీ పేర్కొన్నది. ఫైజర్ టీకాలను 12 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇచ్చేందుకు ఇటీవల కెనడా ఆమోదించింది. ఇండియాకు ఫైజర్ కంపెనీ 5 కోట్ల టీకాలను అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

