కరోనా కట్టడికి ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్ ‘పాక్స్లోవిడ్'(Paxlovid)కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) బుధవారం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవిడ్ చికిత్సకు ఇంట్లోనే ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని88 శాతం తగ్గించడంతో పాటు తీవ్రమైన వ్యాధికి గురైన వారిలో మరణాలను నివారించవచ్చునని అధ్యయనంలో తేలింది.
అమెరికా ప్రభుత్వ అనుమతి పొందిన తొలి కరోనా టాబ్లెట్ ఇదే కావడం విశేషం.