కోర్టుకెళ్లనున్న కుల్‌భూషణ్.. అప్పీల్ బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం

ఇస్లామాబాద్ : గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై భారతీయ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ ఖైదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ పార్లమెంట్ కీలక బిల్లును పాస్ చేసింది. పాకిస్థాన్ హైకోర్టులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకునే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణదండన విధించిన విషయం తెలిసిందే. రీవ్యూ అండ్ రీ కన్సిడరేషన్ బిల్లు 2020కి జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ కోర్టు నియమావళి ప్రకారం జాదవ్ ఇక తన కేసును ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. 51 ఏళ్ల మాజీ నేవీ అధికారి జాదవ్‌కు .. పాకిస్థాన్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణశిక్షను ఖరారు చేసింది.
ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఇండియా ఆశ్రయించింది. జాదవ్‌కు తన కేసును వాదించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. అయితే ఎటువంటి జాప్యం చేయకుండా జాదవ్ కోర్టును ఆశ్రయించే రీతిలో చర్యలు తీసుకోవాలని జూలై 2019లో అంతర్జాతీయ కోర్టు పాకిస్థాన్‌ను ఆదేశించింది. బిల్లుపై న్యాయశాఖ మంత్రి ఫారోగ్ నాసిమ్ మాట్లాడుతూ.. ఒకవేళ బిల్లును పాస్ చేయకుంటే, ఇండియా మళ్లీ యూఎన్ భద్రతా మండలిని ఆశ్రయించేదని, కోర్టు ధిక్కరణ కింద పాక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేదన్నారు. బిల్లును పాస్ చేయడం వల్ల పాకిస్థాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

