జాదవ్‌కు ఊరట.. అప్పీల్ హక్కు బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి, 50 ఏండ్ల కులభూషణ్ జాదవ్‌కు మరింత ఊరట లభించింది. ఆయన అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నది. ‘పాకిస్థాన్ పార్లమెంట్ ఉమ్మడి సెషన్ మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. అప్పీల్ చేసుకునే హక్కును కులభూషణ్ జాదవ్‌కు కల్పించే బిల్లు కూడా ఇందులో ఉన్నది’ అని పాక్ మీడియా పేర్కొంది.
భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్, ఆయనపై గూఢచర్యం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు మోపింది. 2017 ఏప్రిల్‌లో పాక్ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించగా, భారత్ దీనిని అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్ చేసింది. జాదవ్‌ను కలిసేందుకు దౌత్య అధికారులను పాక్ అనుమతించడం లేదని ఆరోపించింది.
ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. మరణ శిక్షపై జాదవ్ అపీల్ కోసం ఆయనను కలిసేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది.
దీంతో గత ఏడాది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నినాదాలు, అభ్యంతరాల నడుమ పాక్ పార్లమెంట్ జాయింట్ సెషన్లో ఈ బిల్లు ఆమోదం పొందింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్‌లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

