న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిలిచింది. ఎయిర్‌లైన్ రేటింగ్స్‌లో పీఐఏ చివరి స్థానంలో నిలిచింది. భద్రతా అంశంలో పీఐఏ దారుణంగా ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు. రేటింగ్‌లో 1 నుంచి 7 వరకు స్టార్స్ ఇస్తారు. అయితే పాక్ జాతీయ ఎయిర్‌లైన్స్‌కు కేవలం ఒక్క స్టార్ మాత్రమే వచ్చింది. పాక్‌తో పాటు మరో ఆరు దేశాల విమానయాన సంస్థలకు వన్ స్టార్ రేటింగ్ వచ్చింది. ఎయిర్ అల్జీరే, సిరివిజయ ఎయిర్, స్కాట్, ఇరాన్ అసేమాన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌బ్లూ, బ్లూ వింగ్‌లు ఉన్నాయి. ప్రమాదాలు లేకుండా ఉంటే.. ఎయిర్‌లైన్స్‌కు త్రీ స్టార్ రేటింగ్ ఇస్తారు. సీరియస్ ప్రమాదాలను అడ్డుకోగలిగితే ఆ సంస్థలకు టూ స్టార్స్ ఇస్తారు. 2020లో కరాచీలో ఓ విమానం జనావాసాల్లో కూలింది. ఆ ప్రమాదంలో వంది మంది మరణించారు. ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటి ఘటనలు చాలా జరిగాయి.