Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు కష్టాలు.. రహస్యపత్రాల లీక్ కేసులో సెప్టెంబర్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తోషాఖానా కేసులో విడుదలకు కోర్టు ఆదేశించి.. ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. తాజాగా రహస్య పత్రాల లీకేజీకి సంబంధించిన కేసులో జ్యుడీషియల్ కస్టడీని పాక్ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 13 వరకు పొడిగించింది. దీంతో జైలు నుంచి బయటపడాలన్న ఇమ్రాన్ ఆశలకు కోర్టు గండికొట్టింది.
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తోషాఖానా కేసులో విడుదలకు కోర్టు ఆదేశించి.. ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. తాజాగా రహస్య పత్రాల లీకేజీకి సంబంధించిన కేసులో జ్యుడీషియల్ కస్టడీని పాక్ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 13 వరకు పొడిగించింది. దీంతో జైలు నుంచి బయటపడాలన్న ఇమ్రాన్ ఆశలకు కోర్టు గండికొట్టింది. భద్రతా కారణాల నేపథ్యంలో అట్టాక్ జైలులో రహస్య పత్రాల లీకేజీ కేసుపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ ఆదేశించారు.
గతంలో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రతాన్ని చూపించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి ఈ ఆధారాలను సేకరించినట్లు ఆ సమయంలో ప్రకటించారు. అయితే, తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 5 నుంచి పంజాబ్ అట్టాక్ జైలు ఉంటున్నారు. మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇమ్రాన్‌ఖాన్‌కు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ విడుదలకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ఇచ్చినా ఇమ్రాన్‌ఖాన్ జైలు నుంచి విడుదల కాలేదు. రహస్య పత్రాల లీక్ వ్యవహారంలో రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది. జైలులో విచారణ జరుపడంపై ఐటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరో వైపు విదేశాంగశాఖ మాజీ మంత్రి మెహమూద్ ఖురేషి సైతం కస్టడీలో ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్ ఓ ర్యాలీలో తన జేబులో నుంచి ఓ పత్రాన్ని చూపించారు. ఆ పేపర్ ప్రభుత్వ రహస్య పత్రమని, తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా రాలీలో తాను చూపిన పత్రం రహస్య పత్రమన్న వాదనలను ఆయన ఖండించారు. ఆ పత్రం ఎక్కడ పోయిందని, దాన్ని ఎక్కడ పెట్టానన్నది గుర్తుకు రాలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

