Pakistan flight | ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
Pakistan flight | షార్జా (Sharjah) నుంచి కరాచీ (Karachi) కి బయలుదేరిన ఒక పాకిస్థాన్ (Pakistan) కార్గో విమానం (Cargo flight) ఐదుగురు సిబ్బందితో సహా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా ప్రయాణిస్తుండగా ఈ బోయింగ్ 737 విమానం (Bowing 737 flight) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది.
Pakistan flight : షార్జా (Sharjah) నుంచి కరాచీ (Karachi) కి బయలుదేరిన ఒక పాకిస్థాన్ (Pakistan) కార్గో విమానం (Cargo flight) ఐదుగురు సిబ్బందితో సహా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా ప్రయాణిస్తుండగా ఈ బోయింగ్ 737 విమానం (Bowing 737 flight) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. నావిగేషన్ వ్యవస్థ (Navigation System) లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పాకిస్థాన్ అధికారులు వెంటనే వివిధ ఏజెన్సీలతో కలిసి సముద్రంలో భారీ గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కే2 ఎయిర్వేస్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ విమానం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 9:18 గంటలకు నావిగేషన్ సమస్య గురించి కరాచీ ఏటీసీకి తెలిపింది. ఏటీసీ అధికారులు విమానానికి మార్గనిర్దేశం చేసే ప్రయత్నంలో ఉండగానే, కేవలం మూడు నిమిషాల తర్వాత విమానం వేగంగా కిందకు పడిపోతున్నట్లు రాడార్‌లో నమోదైంది. కరాచీకి పశ్చిమంగా 287 కిలోమీటర్ల దూరంలో బలూచిస్థాన్‌లోని ఓర్మారా తీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ విమానయాన ట్రాకింగ్ సంస్థ ‘ఫ్లైట్రాడార్ 24’ విశ్లేషణ ప్రకారం.. విమానం గాల్లో పలుమార్లు ఎత్తును కోల్పోయి, మళ్లీ పైకి లేచి, ఆ తర్వాత ఒక్కసారిగా సముద్రం వైపు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధాలు తెగిపోయే ముందు విమానం కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉందని, నిమిషానికి 22,400 అడుగుల అసాధారణ నిలువు వేగంతో కిందకు పడిపోయిందని డేటా సూచిస్తోంది. ఈ వేగం విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందనే వాదనకు బలం చేకూరుస్తోంది.
అదృశ్యమైన ఈ విమానం 27 ఏళ్ల నాటి బోయింగ్ 737-400. కే2 ఎయిర్వేస్ సంస్థ నిర్వహిస్తున్న ఏకైక విమానం కూడా ఇదే. ఈ విమానాన్ని 2024లో సేవల్లోకి తీసుకువచ్చారు. ఇది మొదట 1999లో ప్యాసింజర్ విమానంగా సేవలు అందించి, 2012లో కార్గో విమానంగా మార్పు చెందింది. ప్రస్తుతం విమాన శకలాల కోసం, సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

