మీ బ్యాగులు సర్దుకుని వెళ్లిపోండి.. ఇరాన్ మతపెద్దలకు హిజాబ్ వ్యతిరేక నిరసన సెగ
హిజాబ్ ధరించకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలన్న మరో మతపెద్దకు ఒక మహిళ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తాను ఎక్కడ ఉండాలి, హిజాబ్ ధరించాలా వద్దా అన్నది చెప్పవద్దంటూ ఆయన ముఖంపై అన్నది.
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మరింత తీవ్రమవుతున్నాయి. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించనందకు ఆ దేశ నైతిక పోలీసులు 22 ఏళ్ల యువతి అమినిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. దీంతో తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లిన ఆమె చనిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఆ దేశ మతపెద్దలకు ఈ నిరసన సెగ తగిలింది. హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేసే మతపెద్దలకు ఇరాన్ మహిళలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ‘40 ఏళ్లుగా దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీ బ్యాగులు సర్దుకుని వెళ్లిపోండి’ అని వారిపై మండిపడుతున్నారు.
కాగా, సరైన డ్రెస్ ధరించాలన్న ఒక మత పెద్దకు ఇరాన్ యువతి ఘాటుగా బదులిచ్చింది. నీ పని చూసుకో అని అన్నది. మరోచోట హిజాబ్ ధరించాలన్న మతపెద్దను స్టుపిడ్ అని ఒక మహిళ హేళన చేసింది. హిజాబ్ ధరించబోనని తెగేసి చెప్పింది. అలాగే హిజాబ్ ధరించకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలన్న మరో మతపెద్దకు ఒక మహిళ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తాను ఎక్కడ ఉండాలి, హిజాబ్ ధరించాలా వద్దా అన్నది చెప్పవద్దంటూ ఆయన ముఖంపై అన్నది. తన మాతృభూమిలోనే స్వేచ్ఛగా నివసిస్తానని ఆమె చెప్పింది.
మరోవైపు రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళను హిజాబ్ ధరించాలని ఒక మత పెద్ద చెప్పాడు. దీంతో ఆమె కూడా ఘాటుగా బదులిచ్చింది. ‘మీ మతపెద్దల పెత్తనం ఇక చాలు. మీ బ్యాగులు సర్దుకుని వెళ్లండి’ అని అన్నది. దీంతో అక్కడున్న వారు చప్పట్లతో ఆమెను అభినందించారు. ‘మహిళల జుట్టు చూసి మీరు ఉద్రేకం చెందితే అది మీ సమస్య’ అని మరో మహిళ వ్యాఖ్యానించింది.
కాగా, ఇరాన్ మతపెద్దల తలపాగాలను తొలగించే వీడియోలు వైరల్ అయిన తర్వాత వారు మరింతగా హిజాబ్ వ్యతిరేక నిరసన సెగను ఎదుర్కొంటున్నారు. ఆ దేశ మహిళలు వారిని లెక్కచేయకుండా బదులిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://twitter.com/FridaGhitis/status/1590509414066200576?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1590509414066200576%7Ctwgr%5E76e7ddee5c3740d6d255bbfe5ee4d1b6dd9b69ae%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

