Aerial Defense System: మిస్సైల్, డ్రోన్లను అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. వీడియో
Aerial Defense System: ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చెందిన వీడియోను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. ఆ రక్షణ వ్యవస్థ వందల సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకున్నది. ఇరాన్ సుమారు 170 డ్రోన్లు, 30 క్రూయిజ్ మిస్సైళ్లు, 120 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
న్యూఢిల్లీ: వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయిల్‌పై ఇరాన్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయిల్ ధీటుగా కూల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. సుమారు 300 వరకు డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ వదలినట్లు తెలుస్తోంది. దాంట్లో 99 శాతం ఆయుధాలను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ చెప్పింది. అమెరికా, జోర్డాన్, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల సహకారంతో ఆ దాడిని నిలువరించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్(Aerial Defense System)కు చెందిన ఆపరేషనల్ ఫూటేజ్‌ను ఐడీఎఫ్ దళాలు రిలీజ్ చేశాయి. ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్టు చేశాయి.
170 డ్రోన్లు, 30 క్రూయిజ్ మిస్సైళ్లు, 120 బాలిస్టిక్ మిస్సైళ్లను ఇరాన్ లాంచ్ చేసిందని ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. అయితే ఇజ్రాయిల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్లను అడ్డుకుంటోంది. 2011లో తొలిసారి దీన్ని ఆపరేషన్లోకి తీసుకువచ్చారు. ఐరన్ డోమ్‌తో యారో లాంటి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయిల్ వద్ద ఉన్నది. యారో సిస్టమ్‌తో బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకుంటున్నారు. మీడియం రేంజ్ రాకెట్లను అడ్డుకునేందుకు డేవిడ్స్ స్లింగ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇజ్రాయిల్ వద్ద ఉన్నది.
This is what a 99% interception rate looks like. Operational footage from the Aerial Defense System protecting the Israeli airspace: pic.twitter.com/eAwcUPUDw2
— Israel Defense Forces (@IDF) April 14, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

