పవిత్ర వృక్షం వద్ద నగ్న ఫొటోషూట్.. ఆ జంటకు ఇదీ శిక్ష
బాలి: ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి పవిత్ర మర్రి వృక్షం వద్ద ఓ రష్యా టూరిస్టు నగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వద్ద అలీనా ఫజ్లివా దిగిన నగ్న ఫొటోలు ఆమె ఇన్‌స్టాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన పట్ల స్థానిక బాలీ తెగ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్యా టూరిస్టు అలీనా, ఆమె భర్త స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తబనాన్ జిల్లాలో ఉన్న ఓ ఆలయంవద్ద ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి మర్రి వృక్షం ముందు ఫొటో షూట్ చేయడం పట్ల అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. భర్త ఆండ్రీ ఫజ్లివా ఆ ఫోటోను తీశాడు. ఇండోనేషియా పోలీసులు ఆ జంటను దేశం నుంచి ఆర్నెళ్ల పాటు వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బాలీలోని హిందూ, బౌద్ధ సాంప్రదాయాన్ని పాటిస్తున్న ప్రజలు అక్కడి కొండలు, వృక్షాలు, సహజ వనాలను దేవతలుగా భావించి పూజిస్తారు. అయితే అలాంటి పవిత్ర ప్రదేశంలో రష్యా జంట అక్రమరీతిలో ప్రవర్తించినట్లు బాలీ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆరోపించారు. అందుకే వాళ్లను డిపోర్ట్ చేస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. డిపోర్టేషన్తో పాటు ఆ వృక్షం వద్ద శుద్ది కూడా చేయాల్సి ఉంటుంది. దాని కోసం అయ్యే ఖర్చు మొత్తం ఆ జంట భరించాల్సి ఉంటుంది. పవిత్ర వృక్షం వద్ద తప్పు చేసినట్లు అలీనా తన ఇన్‌స్టాలో అంగీకరించారు. టూరిస్టులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. గత ఏడాది బాలీ దీవుల్లో కోవిడ్ నియమావళి ఉల్లంఘించిన సుమారు 200 మందిని డిపోర్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

