ఓస్లో: నాటో దళాలు నిర్వహిస్తున్న సైనిక శిక్షణలో విషాదం చోటుచేసుకున్నది. విమానం కూలడం వల్ల నలుగురు అమెరికా సైనికులు మృతిచెందినట్లు నార్వే ప్రధాని తెలిపారు. నార్వే ఉత్తరం దిక్కున జరగుతున్న సైనిక విన్యాసాల్లో ఈ ఘటన జరిగినట్లు జోనాస్ గాహర్ తెలిపారు. నార్వేలో జరుగుతున్న డ్రిల్స్‌తో ఉక్రెయిన్ యుద్ధానికి లింక్ లేదు. నాటోలో మొత్తం 30వేల మంది సైనికులు ఉన్నారు. 27 దేశాలకు చెందిన 220 విమానాలు, 50 భారీ నౌకలు ఉన్నాయి.