Underwater Drone: అండర్‌వాటర్ డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా
underwater drone:అండర్‌వాటర్ డ్రోన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ డ్రోన్ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఉత్తర కొరియా జరిపిన ఈ పరీక్ష పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
సియోల్: అణ్వాయుధ సామర్థ్యం(Nuclear capable) కలిగిన అండర్‌వాటర్ డ్రోన్(underwater drone)ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ దేశానికి చెందిన మీడియా శుక్రవారం ఈ ప్రకటన చేసింది. సముద్రంలో సుమారు 80 నుంచి 150 మీటర్ల లోతులో ఆ డ్రోన్ దాదాపు 59 గంటలు క్రూయిజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తన వద్ద ఉన్న నాన్-న్యూక్లియర్(non nuclear) పేలోడ్‌ను అది పేల్చివేసింది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు ఉత్తర కొరియా ఈ పరీక్షలతో పరోక్ష హెచ్చరికలు చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
కొత్త డ్రోన్ సిస్టమ్‌ను హెయిలీ లేదా సునామీగా పిలుస్తున్నారు. శత్రువుల జలాల్లోకి ఈ డ్రోన్లు చొచ్చుకెళ్లి అటాక్ చేయగలవు. అణ్వాయుధాలతో రేడియో ధార్మికత(radio activity) సృష్టించి.. నేవీ పోర్టులను ధ్వంసం చేసే సత్తా ఈ డ్రోన్లకు ఉన్నది. ఏ తీరం నుంచైనా న్యూక్లియర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఉత్తర కొరియా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

