ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇవాళ రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల( Ballistic Missiles)ను ఆ దేశం పరీక్షించింది. ఆ నిషేధిత క్షిపణులను ఈ వారంలోనే ఆరవసారి ఆ దేశం పరీక్షించడం గమనార్హం.
అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, దానికి కౌంటర్‌గా క్షిపణి పరీక్షలు చేస్తున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. మంగళవారం కూడా జపాన్ మీదుగా ఉత్తర కొరియా ఓ మిస్సైల్‌ను ఫైర్ చేసింది. ఈ నేపథ్యంలో యూఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది.
రష్యా, చైనా దేశాలు ఉత్తర కొరియాకు అండగా నిలుస్తున్నాయని అమెరికా ఆ మీటింగ్‌లో ఆరోపించింది. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించకుండా ఆ రెండు దేశాలు రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికా తెలిపింది.