16 ఏళ్లకే ఓటు హక్కు.. న్యూజిలాండ్ కొత్త చట్టం !
New Zealand voting age:న్యూజిలాండ్ కొత్త చట్టాన్ని రూపొందించనున్నది. 16 ఏళ్లు దాటిన వాళ్లకు ఓటు హక్కును కల్పించనున్నది. ఓటరు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త చట్టాన్ని రూపొందించనున్నది. 16 ఏళ్లు దాటిన వాళ్లకు ఓటు హక్కును కల్పించనున్నది. ఓటరు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు దాటిన వాళ్లకే ఓటు హక్కు కల్పించడం అంటే యువత మావన హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది.
అయితే ఓటు హక్కు వయసును కుదించేందుకు ప్రధాని జెసిండా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పాస్ చేసే బిల్లుకు పార్లమెంట్లోని 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. వాతావరణ మార్పులు లాంటి అంశాలపై యువకులు ఓటు వేయాల్సి ఉంటుందని న్యూజిలాండ్ కోర్టు పేర్కొన్నది. బ్రెజిల్, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఓటు వేసే హక్కుల్ని కల్పిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

