నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే.. ఆ దేశంలో క్రిమినల్ కేసు !
Netflix Password నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ యూజర్లకు ఆ సంస్థ షాక్ ఇవ్వనున్నది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పాస్వర్డ్ షేర్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు జరిమానా విధించనున్నారు. ఇక బ్రిటన్‌లో పాస్వర్డ్ షేర్ చేసే వారిపై ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని యోచిస్తున్నారు. ఇంటలెక్యువల్ ప్రాపర్టీ ఆఫీసు (ఐపీఓ).. పాస్వర్డ్ షేరింగ్‌ను నేరంగా పరిగణించనున్నది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి పాస్వర్డ్ షేర్ చేసే యూజర్ల
లండన్: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ యూజర్లకు ఆ సంస్థ షాక్ ఇవ్వనున్నది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పాస్వర్డ్ షేర్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు జరిమానా విధించనున్నారు. ఇక బ్రిటన్‌లో పాస్వర్డ్ షేర్ చేసే వారిపై ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని యోచిస్తున్నారు. ఇంటలెక్యువల్ ప్రాపర్టీ ఆఫీసు (ఐపీఓ).. పాస్వర్డ్ షేరింగ్‌ను నేరంగా పరిగణించనున్నది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి పాస్వర్డ్ షేర్ చేసే యూజర్ల నుంచి అదనపు ఛార్జీ వసూల్ చేయనున్నట్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది.
టీవీ సీరిస్‌లు, సినిమాలు, స్పోర్ట్స్ ఈవెంట్లను అనుమతి లేకుండా యాక్సెస్ చేయడం నేరం అవుతుందని ఐపీవో పేర్కొన్నది. పాస్వర్డ్ షేరింగ్ విషయంలో స్ట్రీమింగ్ సంస్థ కోర్టులను ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు ఐపీవో తెలిపింది. పాస్వర్డ్ షేరింగ్ వల్ల తమ ఆదాయం పడిపోయినట్లు నెట్‌ఫ్లిక్స్ ఇటీవల వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

