నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి.. బల నిరూపణకు 30 రోజుల గడువు..!
KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి నియమితులయ్యారు. ప్రతిపక్షాలు నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో

ఖాట్మండు: నేపాల్ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి నియమితులయ్యారు. ప్రతిపక్షాలు నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో.. దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యుఎంఎల్) నేత ఓలిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 30 రోజుల్లోగా సభలో బలం నిరూపించుకోవాలని సూచించారు.
మొత్తం 121 మంది సభ్యులున్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్)లో ఓలి ప్రత్యర్థి గ్రూపు ఆయనకు మద్దతు ఇస్తుందా? అన్నది సందేహమే. నేపాలీ కాంగ్రెస్ నేత బహుదూర్ దోబా మావోయిస్టు పార్టీ నేత ప్రచండ మద్దతుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. అయితే నేపాలీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో జనతా సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు రావడంతో వెనక్కుతగ్గింది.
దాంతో దోబా తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఒక దశలో సీపీఎన్ (యుఎంఎల్) కు చెందిన మాధవ్ కుమార్ నేపాల్, ఉపేంద్ర యాదవ్, జేఎస్పీలోని బాబూరామ్ భట్టారారు గ్రూపు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు యత్నించినప్పటికీ తగినంత మెజారిటీ లభించకపోవడంతో వెనక్కుతగ్గారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

