విమానం గాల్లో ఉండగా చొచ్చుకొచ్చిన బుల్లెట్… గాయపడిన ప్రయాణికుడు
కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు ఆ విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపించింది.
నైపిడావ్: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక బుల్లెట్ దానిలోకి చొచ్చుకొచ్చింది. ఆ బుల్లెట్ ఒక ప్రయాణికుడికి తగలడంతో గాయపడ్డాడు. సైనిక పాలన ఉన్న మయన్మార్‌లో ఈ సంఘటన జరిగింది. మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్నది. ఇంతలో ఒక బుల్లెట్ విమానం కింది భాగం నుంచి లోపలకు చొచ్చుకొని వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి శరీరంలోకి అది దిగింది. లోయికావ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన ప్రయాణికుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ నగరానికి వచ్చే అన్ని విమానాలను మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ నిరవధికంగా రద్దు చేసింది.
కాగా, కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు ఆ విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రయాణికుల విమానంపై ఈ రకమైన దాడి యుద్ధ నేరమని మయన్మార్ పాలక మిలిటరీ కౌన్సిల్ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ తెలిపారు. శాంతి కోరుకునే వ్యక్తులు, సంస్థలు దీనిని అన్ని విధాలుగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తిరుగుబాటు దళాలు ఈ ఆరోపణలను ఖండించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

