Emergency Door | టేకాఫ్‌కు ముందు.. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దిగిన వ్యక్తి
Emergency Door | ఆ వ్యక్తి వెంటనే విమాన ఎమర్జెన్సీ డోర్ వద్దకు పరుగెత్తాడు. దానిని తెరువడంతోపాటు స్లిడ్ను యాక్టివేట్ చేశాడు. విమాన సిబ్బంది, ప్రయాణికులు చూస్తుండగా స్లిడ్ మీదుగా కిందకు జారాడు. దీంతో అక్కడ ఉన్న లగేజ్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
వాషింగ్టన్: విమానం టేకాఫ్‌కు సిద్ధం కాగా, ఒక వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ (Emergency Door)తో పాటు స్లిడ్ను తెరిచాడు. దాని మీదుగా జారి విమానం నుంచి కిందకు దిగాడు. ఈ సంఘటనతో విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎయిర్పోర్ట్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సీటెల్‌కు వెళ్లే డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. విమానం డోర్ మూసుకుంటుండగా దాని వద్దకు పరుగెత్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని విమాన సిబ్బందిని ప్రశ్నించాడు. సీట్లో కూర్చోవాలని సిబ్బంది అతడికి చెప్పారు.
కాగా, ఆ వ్యక్తి వెంటనే విమాన ఎమర్జెన్సీ డోర్ వద్దకు పరుగెత్తాడు. దానిని తెరువడంతోపాటు స్లిడ్ను యాక్టివేట్ చేశాడు. విమాన సిబ్బంది, ప్రయాణికులు చూస్తుండగా స్లిడ్ మీదుగా కిందకు జారాడు. దీంతో అక్కడ ఉన్న లగేజ్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించగా అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మానసిక స్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సంఘటనతో టేకాఫ్ కావాల్సిన ఆ విమానం నిలిచిపోయింది. భద్రతా కారణాల వల్ల అందులోని ప్రయాణికులను కిందకు దించి వేశారు. మూడు గంటల తర్వాత వారంతా డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానంలో సీటెల్‌కు ప్రయాణమయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

