న్యూయార్క్, ఆగస్టు 13: ఇంటర్నెట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని అమెరికాకు చెందిన జరేడ్ మౌచ్ ఏకంగా సొంత బ్రాడ్‌బ్యాండ్ తయారుచేసుకున్నాడు. 1.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలందించినందుకు అతడికి రూ.40 లక్షల బిల్లు వచ్చిందట. దీంతో సొంత ఫైబర్ బ్రాడ్‌బాండ్ రూపొందించుకున్నాడు. తమ ప్రాంతానికి అమెరికన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ స్పీడ్ ఇంటర్నెట్ అందించట్లేదని సొంతంగా వాష్టెనా ఫైబర్ సర్వీసెస్ పేరుతో టెలిఫోన్ కంపెనీనే పెట్టుకున్నాడు. నెట్వర్క్ ఇంజినీర్‌గా పనిచేసే జరేడ్ ఐదేండ్ల కిందట దీన్ని అభివృద్ధిపరిచాడు. అప్పట్లో కేవలం తన కోసం రూపొందించుకున్నప్పటికీ రానురాను చుట్టుపక్కల వాళ్లు కూడా సేవలు వినియోగించుకోవడం ప్రారంభించారు. 70 మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.