హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్‌లోని బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కాజ్వే షాపింగ్ జిల్లాలో ఉన్న గ్లౌసెస్టర్ రోడ్డులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్‌లో ఈ ప్రమాదం సంభవించింది. 38 అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఆఫీసులు, మాల్ ఉన్నాయి. ఆ భారీ బిల్డింగ్‌పై వందలాది మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే డజన్ల సంఖ్యలో జనాల్ని రక్షించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బిల్డింగ్ రూఫ్‌టాప్‌పై సుమారు మూడు వంద మంది ఉన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు చెప్పింది. తాజా సమాచారం ప్రకారం ఒకరు మృతిచెందగా, మరో నలుగుర్ని హాస్పిటల్లో చేర్పించారు. స్థానిక కాలమానం 12.37 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ స్విచ్ రూమ్‌లో మొదట మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ