Bernard Arnault: 200 బిలియన్ల డాలర్లు దాటిన బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద
Bernard Arnault: 2.4 బిలియన్ల డాలర్ల నుంచి 201 బిలియన్ల డాలర్లకు బెర్నార్డ్ సంపద పెరిగింది. లూయిస్ విట్టాన్ కంపెనీ షేర్లు గత ఏడాది దాదాపు 30 శాతం పెరిగాయి. దీంతో ఆయన ఆస్తుల విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగింది.
న్యూయార్క్: లూయిస్ విట్టాన్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్(Bernard Arnault) సంపద మరింత రెట్టింపు అయ్యింది. మంగళవారం ఆయన సంపద(fortune) విలువ 200 బిలియన్ల డాలర్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఐటమ్స్‌కు ఫుల్ డిమాండ్ పెరగడంతో.. లూయిస్ విట్టాన్(Louis Vuitton) కంపెనీ వస్తువుల సేల్స్ గత ఏడాది భారీగా పెరిగాయి. దీంతో ఆ కంపెనీ షేర్లు అమాంతంగా 30 శాతం పెరిగాయి. గత ఏడాది ఆయన సంపద దాదాపు 40 బిలియన్ల డాలర్లు పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది.
లూయిస్ విట్టాన్కు చెందిన క్రిస్టియన్ డయిర్ కంపెనీలో బెర్నార్డ్ కు దాదాపు 98 శాతం వాటా ఉన్నది. అయితే మంగళవారం ఒక్క రోజే ఆ కంపెనీ దాదాపు 3 బిలియన్ల డాలర్ల ఆదాయాన్నిఆర్జించింది. రెండు కంపెనీల షేర్లు దూసుకెళ్లడంతో లూయిస్ విట్టాన్ సీఈవో ఆస్తులు పెరిగాయి. 2.4 బిలియన్ల డాలర్ల నుంచి 201 బిలియన్ల డాలర్లు ఆయన ఆస్తులు చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ చెప్పింది. వ్యక్తిగతంగా 200 బిలియన్ల డాలర్ల మార్క్ దాటిన మూడవ సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు.
ఎలన్ మస్క్ గత ఏడాది 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం.. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా షేర్లు పడిపోవడంతో.. ఆయన సంపద 25 బిలియన్ల డాలర్లు తగ్గింది. ఇక 128 బిలియన్ల డాలర్లతో జెఫ్ బేజోష్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2020 ఆగస్టులోనే బేజోష్ సంపద 200 బిలియన్ల మార్క్‌ను దాటేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

