లండన్: మీకు బోర్ కొడితే ఏంచేస్తారు? పాటలు వినడం.. పుస్తకాలు చదువడం..ఇష్టమైన పనుల్లో లీనమవుతుంటారు కదా. బ్రిటన్‌కు చెందిన డేనియల్ ఎమ్లిన్ జోన్స్ (49) మాత్రం ఓ అసాధారణ పనికి పూనుకున్నాడు. తన ఇంట్లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన మొక్కగా పేరుగాంచిన జింపీ-జింపీని పెంచుతున్నాడు.
ఈ మొక్కను ‘ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ’ అని పిలుస్తారు. ఇది విషపూరితమైన మొక్క. ఇది పరిసర ప్రాంతాల్లో వేడి యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ముట్టుకుంటే షాక్ కొడుతుంది. బాధితులు కొన్ని నెలలవరకూ దీనితాలూకు బాధను అనుభవిస్తారు. ఇది న్యూరోట్యాక్సిన్లను కూడా విడుదల చేస్తుంది. దీంతో ఈ మొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న మనుషుల్లో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి.