భూమికి సమీపం నుంచి వెళ్లిన పెద్ద గ్రహశకలం

వాషింగ్టన్: అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఒక పెద్ద గ్రహశకలం ఆదివారం భూమికి సమీపం నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లింది. జీఎంటీ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఇది భూమిని క్రాస్ చేసినట్లు ఫ్రాన్స్‌లోని అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం తెలిపింది. 2001 FO32 పేరుతో పిలిచే ఈ గ్రహశకలం ఈ ఏడాది భూమికి చేరువగా వచ్చే వాటిలో అతి పెద్దదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. భూమికి 20 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది పాస్ అయ్యిందని పేర్కొంది. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి ఇది 5.25 రెట్లని తెలిపింది.
900 మీటర్లు (3 వేల అడుగులు) పొడవైన ఈ గ్రహశకలాన్ని 20 ఏండ్ల కిందట గుర్తించినట్లు నాసా తెలిపింది. గంటకు 1,24,000 కిలోమీటర్ల వేగంతో భూమిని క్రాస్ అయిన 2001 FO32 వల్ల ప్రస్తుతం లేదా మరో వంద ఏండ్లలో ఎలాంటి ముప్పు లేకపోయినా భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని అంచనా వేసింది. మన సౌరవ్యవస్థ ఆవిర్భానికి చెందినగా భావిస్తున్న ఈ గ్రహశకలం పరిమాణం, దాని ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతిని అధ్యయనం చేయడం ద్వారా అందులోని మూలకాల గురించి తెలుసుకోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ గ్రహశకలం ఉపరితలాన్ని సూర్యరశ్మి తాకినప్పుడు, శిలలోని ఖనిజాలు కొన్ని తరంగ దైర్ఘ్యాలను గ్రహిస్తాయని, మరికొన్ని ప్రతిబింబిస్తాయని నాసా తెలిపింది. ఆస్టరాయిడ్ ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతి వర్ణపటాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ గ్రహశకలం ఉపరితలంపై ఉన్న ఖనిజాల రసాయనాలను అంచనా వేయవచ్చని పేర్కొంది. 2001 FO32 ఆస్టరాయిడ్ తిరిగి 2052లో భూమికి సమీపంగా వెళ్తుందని నాసా వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

