హమాస్ కొత్త చీఫ్‌గా ఖలీద్ అల్ హయ్యా
పాలస్తీనాకు చెందిన ప్రముఖ సాయుధ సంస్థ హమాస్ తన కొత్త రాజకీయ విభాగం అధిపతిగా సీనియర్ నేత ఖలీద్ అల్ హయ్యాను నియమించింది.
జెరూసలేం: పాలస్తీనాకు చెందిన ప్రముఖ సాయుధ సంస్థ హమాస్ తన కొత్త రాజకీయ విభాగం అధిపతిగా సీనియర్ నేత ఖలీద్ అల్ హయ్యాను నియమించింది. సంస్థలో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఒకరైన ఆయనను ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేశారని ‘రాయిటర్స్’ తెలిపింది. ఖలీద్ అల్ హయ్యా 1960లో గాజా స్ట్రిప్‌లో జన్మించారు. 1980ల ప్రారంభంలో ముస్లిం బ్రదర్ హుడ్‌లో చేరిన ఆయన 1987లో హమాస్ సంస్థ ఏర్పాటైనపుడు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన దివంగత నేతలు ఇస్మాయిల్ హనియా, హయ్యా సిన్వర్లకు అత్యంత సన్నిహితునిగా మెలిగారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ చర్చల్లో అల్ హయ్యా కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

