వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌజ్ కరస్పాడెంట్స్ డిన్నర్ పార్టీలో నిందితుడు అల్లెన్ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతను ఓ హిట్లిస్టును తయారు చేసుకుని దాడికి దిగాడు. ట్రంప్‌తో సహా ప్రభుత్వ పెద్దలు ఆ లిస్టులో ఉన్నారు. కానీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్(Kash Patel) పేరు మాత్రం ఆ లిస్టులో లేదు. 1052 పదాలతో షూటర్ అల్లెన్ ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మెయిల్లో అతనో హిట్‌లిస్టు పేర్కొన్నాడు. కానీ అతని టార్గెట్‌లో కాష్ పటేల్ పేరు లేకపోవడం పట్ల చర్చ మొదలైంది. ముఖ్యమైన వ్యక్తుల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఒకరు. కానీ అతని పేరులేకుండా హిట్‌లిస్టు ఎలా తయారు చేశాడన్న దానిపై దర్యాప్తు అధికారులు ఆలోచనల్లో పడ్డారు.
పలు రకాల కోణాల్లో వారు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఐడియాలజీ నుంచి ఆపరేషనల్ స్ట్రాటజీ కోణంలో విచారిస్తున్నారు. మతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మరీ విచారణ చేపడుతున్నట్లు న్యూయార్క్ పోస్టు తన కథనంలో పేర్కొన్నది. అయితే నిందితుడు అల్లెన్ .. క్రైస్తవ వ్యతిరేకి అని తెలిసింది. యాంటీ క్రిస్టియన్ సెంటిమెంట్స్ అతనిలో ఉన్నాయి. ఇక ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్.. ఓ హిందువు. కాష్ పటేల్ హిందువు కావడం వల్లే అతన్ని హిట్‌లిస్టు నుంచి తప్పించి ఉంటాడని భావిస్తున్నారు. పటేల్ మతవిశ్వాసం భిన్నమైంది కాబట్టి.. అతన్ని నిందితుడు వదిలేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు.
కేవలం ట్రంప్ మీద ఫోకస్ పెట్టడం వల్ల శాంతిభద్రత విభాగానికి చెందిన పటేల్‌ను విస్మరించి ఉంటాడని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. లా ఎన్ఫోర్స్మెంట్ను టార్గెట్ చేయాలన్న ఆలోచన తనకు లేదని అల్లెన్ పేర్కొన్న విషయాన్ని కొందరు గుర్తు చేశారు. అందుకే పటేల్ పేరును ఆ లిస్టు నుంచి తీసేసినట్లు అనుమానిస్తున్నారు. డిన్నర్ టైంలో దాడి జరిగినప్పుడు కాష్ పటేల్ కూడా అక్కడే ఉన్నారు. కాల్పుల శబ్ధం వినబడగానే పటేల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి టేబుల్ కింద దాక్కున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎందుకు ఆ నిందితుడు దాడికి ప్రయత్నించాడన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు రిపోర్టులో తెలిసింది.