AI Minister | బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కనిష్క నారాయణ్
AI Minister | బ్రిటన్ రాజకీయాల్లో (Britain Politics) ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశానికి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి (AI Minister) గా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ (Kanishka Narayan) బాధ్యతలు స్వీకరించారు. కనిష్క నారాయణ్‌ను ఏఐ మంత్రిగా నియమిస్తున్నట్లు భారత నూతన ప్రధానమంత్రి (Britain PM) ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) మంగళవారం ఉదయం ప్రకటించారు.
AI Minister : బ్రిటన్ రాజకీయాల్లో (Britain Politics) ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశానికి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి (AI Minister) గా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ (Kanishka Narayan) బాధ్యతలు స్వీకరించారు. కనిష్క నారాయణ్‌ను ఏఐ మంత్రిగా నియమిస్తున్నట్లు భారత నూతన ప్రధానమంత్రి (Britain PM) ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) మంగళవారం ఉదయం ప్రకటించారు. ఆ మేరకు తాజాగా కనిష్క నారాయణ్ బాధ్యతలు స్వీకరించారు. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతలో ప్రపంచస్థాయి అగ్రగామిగా నిలవాలన్న యూకే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకం అద్దం పడుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏఐతో ముడిపడిన అవకాశాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏఐ నియంత్రణ, నైతిక వినియోగం, ఆర్థికవ్యవస్థతో దాని అనుసంధానం వంటి అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ పాలసీ, ఆవిష్కరణల రంగంలో అపార అనుభవం ఉన్న కనిష్క నారాయణ్ నియామకాన్ని ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఏఐవల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే, దానితో ముడిపడిన ముప్పులను నివారించడం ఆయన ప్రధాన బాధ్యత కానుంది. కాగా కనిష్క వేల్స్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
ప్రధాని ఆండీ బర్న్‌హామ్ భారత మూలాలున్న ఇద్దరికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. వారిలో కనిష్క నారాయణ్‌తోపాటు లీసా నాండీ ఉన్నారు. కనిష్క గతంలో కీర్ స్టార్మర్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆన్లైన్ భద్రత, కృత్రిమ మేథ విభాగాలను పర్యవేక్షించిన ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఏఐ మంత్రిగా నియమితులయ్యారు. బీహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన ఆయన, 2025లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక లీసా నాండీ, కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాంచెస్టర్‌లో జన్మించిన ఆమె తండ్రి దీపక్ నాండీ పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు కాగా.. తల్లి బ్రిటన్ జాతీయురాలు. లీసా 2010 నుంచి విగాన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

