Joe Biden | నేవీ జాన్ రాబర్ట్స్ నా మనుమరాలే.. జో బైడెన్ క్లారిటీ..
Joe Biden | తన కొడుకు హంటర్ బైడెన్, ఆయన భార్య లండెన్ రాబర్ట్స్ కూతురు నేవీ జాన్ రాబర్ట్స్ తన మనుమరాలేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు.
Joe Biden | నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేండ్ల చిన్నారి తన మనుమరాలేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తన కొడుకు హండర్ బైడెన్, లండెన్ రాబర్ట్స్ దంపతులకు జన్మించిన సంతానమేనని చెప్పారు. ఆమె తన ఏడో మనుమరాలని పేర్కొన్నారు. ఈ అంశంపై అమెరికాలో కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో జో బైడెన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నది. తమ మనుమలందరికీ మంచే జరుగాలని కోరుకుంటున్నట్లు తాను, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కోరుకుంటున్నామన్నారు.
`మా కొడుకు హంటర్ బైడెన్, అతడి భార్య లండెన్ రాబర్ట్స్ వారి కూతురి ప్రయోజనాల కోసం ఆమె ప్రైవసీని కాపాడుతూ ఉన్నారు` అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్ తెలిపారు. ఇది కేవలం కుటుంబ పరమైన అంశం మాత్రమేనని, విమర్శలకు తావులేదని తేల్చి చెప్పారు. నేవీ జాన్ రాబర్ట్స్ పెంపకం బాధ్యతలపై ఆమె తల్లి లండెన్ లాబర్ట్స్ కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ సంగతి బయట పడింది. కోర్టు తీర్పు మేరకు హంటర్ బైడెన్‌కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడంతో ఆ చిన్నారికి తండ్రి అని తేలింది. దీంతో నేవీ జాన్ రాబర్ట్స్ పెంపకం బాధ్యత హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్స్ చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

