న్యూజిలాండ్ సూపర్మార్కెట్లో ఉగ్రదాడి.. కత్తితో ఆరుగుర్ని పొడిచిన ఐసిస్ ఉన్మాది

ఆక్లాండ్: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉన్న ఓ సూపర్మార్కెట్లో ఇవాళ ఉగ్రదాడి జరిగినట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఆరుగురిన్ని కత్తితో పొడిచిన ఆ ఉన్మాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వెల్లడించారు. శ్రీలంకకు చెందిన ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు ఆమె చెప్పారు. కత్తిదాడి జరిగిన 60 సెకన్ల లోపే ఆ ఉన్మాదిని హతమార్చినట్లు ప్రధాని జెసిండా తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి 2011లో న్యూజిలాండ్‌కు వచ్చాడని, 2016 నుంచి అతనిపై జాతీయ భద్రతా దళం నిఘా పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆ ఉన్మాది భావజాలం విపరీతంగా ఉన్న నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టినట్లు జెసిండా తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉన్మాది సూపర్మార్కెట్లో కత్తితో బీభత్సం సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజలు ఆ మార్కెట్ నుంచి అటూ ఇటూ పరుగులు తీశారన్నారు. అరుపులు, కేకలు పెట్టారన్నారు. ఓ వ్యక్తి కత్తిపోట్లతో కిందపడిపోయినట్లు ఒకరు తెలిపారు. న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్‌మాల్ నుంచి జనం భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆరుగుర్ని హాస్పటల్‌కు తీసుకువెళ్లగా, దాంట్లో ముగ్గురు క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్న ఆ ఉన్మాదికి ఇటీవల 12 నెలల శిక్ష పడింది. అభ్యంతరకర వస్తువులను కలిగి ఉన్న కేసులో ఆ శిక్షను విధించారు. కేవలం ముస్లింను కావడం వల్లే తనను వేధిస్తున్నట్లు ఆ వ్యక్తి కోర్టుకు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఇంటర్నెట్ సెర్చ్‌ను పోలీసులు పరిశీలించారు. దాంట్లో ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ గురించి అతను సెర్చ్ చేసినట్లు తెలిసింది. వాళ్లు ధరించే దస్తులు, జెండాలు, వాడే ఆయుధాలు, ఇస్లామిక్ హీరోలు ఎవరని సెర్చ్ చేసినట్లు కూడా తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

