British MP | ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్‌కు ఉంది.. యూకే పార్లమెంట్లో ఎంపీ ప్రీతి పటేల్ స్పీచ్
British MP | పహల్గాం (Pahalgam) లో కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ (Britain MP) ప్రీతి పటేల్ (Priti Patel) అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్లో భారత్‌కు మద్దతుగా ఎంపీ ప్రీతి తన గళం వినిపించారు.
British MP : పహల్గాం (Pahalgam) లో కాల్పులకు తెగబడి అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడిచేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ (Britain MP) ప్రీతి పటేల్ (Priti Patel) అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్లో భారత్‌కు మద్దతుగా ఎంపీ ప్రీతి తన గళం వినిపించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ను సమర్థించారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై ఎంపీ ప్రీతి పటేల్ అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల చర్య కారణంగా భారత్‌లో ఇప్పటికే ముంబై, ఢిల్లీ దెబ్బతిన్నాయని, ఇప్పుడు ఆ జాబితాలో పహల్గాం చేరిందని అన్నారు.
‘పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్‌లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్న ముంబై, న్యూఢిల్లీల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుంది. యూకే, భారత్‌ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు చరిత్ర స్పష్టం చేస్తోందని ప్రీతి పటేల్ అన్నారు. ఆ ఉగ్రవాద సంస్థకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని ఇటీవల నివేదికలు వెలువడినట్లు తెలిపారు. యూకే, దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగించేలా ఏ ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాకిస్థాన్‌లో చురుకుగా ఉన్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

